Christian: క్రైస్తవుడు సీఎంగా ఉండాలనేది నా కోరిక: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి

My wish is to have a Christian as CM says Kakinada City MLA Dwarampudi
  • జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లకు తెలుసు అంటూ వ్యాఖ్యలు
  • ఇటీవల కాడినాడలో ప్రీక్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించిన ఎమ్మెల్యే
  • సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వ్యాఖ్యలు

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాకినాడలోని మెక్లారిన్‌ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్‌ వేడుకల్లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో 140 రోజుల సమయం ఉందని, తదుపరి సీఎం ఎవరనేది తెలిసిపోతుందన్నారు. రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండాలని, అదే జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలనేది తన కోరిక అని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

‘‘ నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దేవుడి బలమే కారణం’’ అని ద్వారంపూడి అన్నారు. స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా జగన్‌ సీఎంగా ఉండాలని వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లు అందరికీ తెలుసునని, రానున్న రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

  • Loading...

More Telugu News