ఇది కదా తెగువ అంటే! కాల్పులు జరిపిన దుండగులను చీపురుకర్రతో తరిమికొట్టిన మహిళ.. వీడియో ఇదిగో!
- హర్యానాలోని భివానీలో ఘటన
- ఇంటి బయట నిల్చున్న బాధితుడిపై బైక్‌పై వచ్చి నిందితుల కాల్పులు
- శరీరంలోకి దూసుకెళ్లిన నాలుగు బుల్లెట్లు
- కాల్పుల శబ్దానికి బయటకు వచ్చి తరమికొట్టిన పొరుగింటి మహిళ
హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధితుడిని హరికిషన్‌గా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అతడికి సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్య కేసు నిందితుడైన హరికిషన్ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నాడు. దుండగుల కాల్పుల్లో గాయపడిన హరికిషన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.