KTR: రెండు నెలల్లో 30 బహిరంగ సభలు... 30 ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కేటీఆర్

Minister KTR participated 30 public meetings in two months
  • రోజుకు 15 నుంచి 18 గంటలు పార్టీ కోసం పని చేసిన మంత్రి కేటీఆర్
  • ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో కేటీఆర్
  • ప్రతిరోజు వేలాదిమందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహణ

బీఆర్ఎస్ గెలుపు కోసం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరుగా ప్రచారం నిర్వహించారు. రెండు నెలల్లో ముప్పై బహిరంగ సభలు, డెబ్బై రోడ్డు షోలలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేద్దామని తన ప్రచారంలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పాల్గొన్నారు. ఆయన రోజుకు దాదాపు 15 గంటల నుంచి 18 గంటలు పార్టీ గెలుపు కోసం పని చేశారు.

రెండు నెలల్లో 30 బ‌హిరంగ స‌భ‌లు, 70 రోడ్డు షోలతో పాటు 30కి పైగా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. 150కి పైగా టెలికాన్ఫ‌రెన్సులు నిర్వహించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జేపీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, గోరెటి వెంకన్నలతో ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ప్రతిరోజు వేలాదిమందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇంఛార్జిలు, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News