Revanth Reddy: 'మీ రేవంతన్న సందేశం...' అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy message to Telangana people
  • వందలాది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి
  • పదేళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శలు
  • కాంగ్రెస్ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన వీడియోను విడుదల చేశారు. అరవై సంవత్సరాల పోరాటం.. వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను పదేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాబట్టి తెలంగాణ ప్రజలు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ వచ్చిందో ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు. సోనియమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. 

'మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.. ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.. చేయి చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం..' అని ట్వీట్ చేశారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Election

More Telugu News