Chiranjeevi: చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1000 కోట్లు సంపాదించారు: మన్సూర్ అలీ ఖాన్

Chiranjeevi earned 1000 cr by settin up the party says Mansoor Ali Khan
  • త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ పై చిరంజీవి ఆగ్రహం
  • చిరు, త్రిష, ఖుష్బూలపై పరువునష్టం దావా వేస్తానన్న మన్సూర్
  • చిరంజీవి తనకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్య

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని చిరంజీవి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మన్సూర్ స్పందిస్తూ... ఎవరిది వక్రబుద్ధి? అని ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని అన్నారు. వచ్చిన సంపాదనంతా వాళ్లు వాళ్ల కోసమే వాడుకుంటున్నారని... ప్రజలకు ఇవ్వడం లేదని చెప్పారు. చిరంజీవిపై రూ. 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై రూ. 10 కోట్ల చొప్పున పరువునష్టం దావా వేస్తానని అన్నారు. ఈ డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తానని చెప్పారు. చిరంజీవి తప్పు చేశారని... తనకు ఫోన్ చేసి 'మన్సూర్.. ఏం జరిగిందో చెప్పు' అని అడిగి తెలుసుకుని ఉంటే బాగుండేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News