EC: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడం పట్ల కర్ణాటక ప్రభుత్వంపై ఈసీ సీరియస్

EC serious on Karnataka govt
  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
  • నవంబరు 30న పోలింగ్
  • తెలంగాణ కాంగ్రెస్ కు మద్దతుగా కర్ణాటక సర్కారు ప్రకటనలు
  • కర్ణాటక ప్రకటనలకు తమ అనుమతి లేదన్న ఈసీ
  • వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక సీఎస్ కు లేఖ
కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ఎన్నికల ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కర్ణాటకు సీఎస్ కు లేఖ రాసింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఎన్నికల ప్రకటనలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈ సందర్భంగా ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఎన్నికల ప్రకటనలు నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది.
EC
Karnataka
Congress
Telangana
Assembly Election

More Telugu News