KTR: ఓటర్లకు ఐవీఆర్ఎస్ ద్వారా కేటీఆర్ ఫోన్

Minister KTR phone call to Siricilla and Hyderabad voters
  • సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేశానో వివరిస్తున్న కేటీఆర్
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరణ
  • మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న కేటీఆర్
'హలో.. నేను కేటీఆర్‌ను మాట్లాడుతున్నా..' అంటూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల, హైదరాబాద్‌లలోని ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు! కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు భాగ్యనగరవాసులకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తున్నారనుకునేరు.... ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తాను ఏం అభివృద్ధి చేశానో వివరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే చాలామందికి వచ్చింది.
KTR
Telangana Assembly Election
Rajanna Sircilla District
BRS

More Telugu News