Vishal34: విశాల్ 34వ చిత్రం నుంచి కీలక అప్ డేట్

Important update from Vishal 34
  • 'సింగం' ఫేమ్ హరి దర్శకత్వంలో విశాల్ 34వ చిత్రం
  • డిసెంబరు 1న టైటిల్ వెల్లడి
  • ఇటీవలే 'మార్క్ ఆంటోని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్

తమిళ హీరో విశాల్ తన 34వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే 'మార్క్ ఆంటోని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్... కొత్త చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను పంచుకున్నాడు. తన 34వ చిత్రం టైటిల్ ను డిసెంబరు 1వ తేదీన ప్రకటిస్తామని వెల్లడించాడు. అదే రోజున ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని తెలిపాడు. 

'సింగం' ఫేమ్ హరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం గత ఏప్రిల్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్ సమర్పిస్తోంది. 

తాజా అప్ డేట్ ను పరిశీలిస్తే ఓ వైపు స్టెతస్కోప్, మరోవైపు రివాల్వర్ కనిపిస్తున్నాయి. ఇందులో విశాల్ డాక్టర్ గా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. ఇతర తారాగణం వివరాలు ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News