Asaduddin Owaisi: కాంగ్రెస్ పార్టీ రైతుబంధును ఎందుకు అడ్డుకుందో అర్థం కావట్లేదు: అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi responds on Rythu Bandu halting
  • రైతుబంధు పథకం పాతదేనని స్పష్టం చేసిన అసదుద్దీన్
  • పంట సాయాన్ని రైతులకు చేరకుండా కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శలు
  • పాత పథకాన్ని అడ్డుకోవడం ద్వారా రైతు వ్యతిరేకిగా తేటతెల్లమైందన్న అసదుద్దీన్
రైతుబంధు పథకం పాతదేనని... అయినా కాంగ్రెస్ దీనిని ఎందుకు అడ్డుకుంటుందో.. ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇది కొత్త పథకం అయి ఉంటే అప్పుడు ఆపవచ్చునని గుర్తు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుబంధు కింద వచ్చే పంట సాయాన్ని రైతులకు చేరకుండా కాంగ్రెస్ అడ్డుకుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈ పథకం చాలా ఏళ్లుగా అమలులో ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అని ప్రశ్నించారు. ఇది కొత్త పథకం అయితే భిన్నంగా ఆలోచించేవాళ్లమన్నారు. కానీ పాత పథకాన్ని హఠాత్తుగా అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీ రైతు వ్యతిరేకమని తేటతెల్లమైందన్నారు. రైతుబంధును అడ్డుకోవ‌డం అంటే కాంగ్రెస్ పార్టీ త‌ప్పుడు సంకేతాలు పంపుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని విమర్శించారు.
Asaduddin Owaisi
rythu bandhu
Telangana Assembly Election
MIM

More Telugu News