Siddharth: రేపు ఓటీటీ సెంటర్ కి వస్తున్న 'చిన్నా'

Chinna movie OTT streamong confirmed
  • తమిళంలో హిట్ కొట్టిన 'చిత్త' సినిమా 
  • తెలుగు అనువాదంగా వచ్చిన 'చిన్నా' 
  • బాలికలపై లైంగిక దాడి నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 28 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్   

హీరో సిద్ధార్థ్ తమిళ్ .. తెలుగు భాషల్లో ఎక్కడి నుంచి ఎలాంటి అవకాశం వచ్చినా చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక్కోసారి తనకి నచ్చిన కథలను చేయడానికి తానే నిర్మాతగా మారుతుంటాడు. అలా తాను నిర్మాతగా ఆయన చేసిన మరో తమిళ సినిమానే 'చిత్త'. సెప్టెంబర్ 28వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. 

ఈ సినిమాను తెలుగులో 'చిన్నా'గా అక్టోబర్ 6వ తేదీన విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ కథలో హీరో అన్నయ్య చనిపోవడంతో ఆయన భార్యాబిడ్డల బాధ్యత హీరోపై పడుతుంది. ఆ ఫ్యామిలీకి న్యాయం చేయడానికి హీరో నానా కష్టాలు పడుతుంటే, ఓ చిన్నారిని లైంగిక దాడి చేశాడనే కేసులో అతను చిక్కుకుంటాడు. అలాంటి పరిస్థితిలో నుంచి అతను ఎలా బయటపడ్డాడనేదే కథ.

ఈ కేసు విచారణ జరిగే తీరు .. హీరోను వెంటాడే సన్నివేశాలు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ వెళతాయి. ఈశ్వర్ పాత్రలో సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో నిమిషా సజయన్ .. బేబీ సహస్ర .. అంజలి నాయర్ కనిపిస్తారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని అందించాడు.

Siddharth

More Telugu News