Ambati Rambabu: యువగళం మళ్లీ ప్రారంభం కావడంపై అంబటి రాంబాబు సెటైర్లు

Ambati Rambabu satires on Nara Lokesh Yuvagalam Padayatra restart
  • చంద్రబాబు అరెస్ట్ తో తాత్కాలికంగా ఆగిపోయిన యువగళం యాత్ర
  • నేడు రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతున్న యువగళం
  • హాస్యగళం విని నవ్వుకోండని అంబటి ఎద్దేవా
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు పునఃప్రారంభమవుతోంది. రాజోలు నియోజకవర్గం నుంచి యాత్ర మొదలు కానుంది. ఉదయం 11.20 గంటలకు తాటిపాకలో బహిరంగసభ జరగనుంది. ఈనాటి యాత్రలో ఓఎన్జీసీ ఉద్యోగులు, మత్స్యకారులు, రజక సామాజికవర్గం ప్రజలతో లోకేశ్ భేటీ కానున్నారు. మరోవైపు యువగళం యాత్ర మళ్లీ ప్రారంభం కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... 'ప్రారంభమయిన "హాస్యగళం" విని, చూసి........ నవ్వుకోండి !' అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో యువగళం యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు మళ్లీ యాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
Ambati Rambabu
YSRCP
Nara Lokesh
Telugudesam
Yuva Galam Padayatra

More Telugu News