Pragathi: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన నటి ప్రగతి

Actress Pragathi won bronze in national bench press championship
  • ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నటిగా ప్రగతికి గుర్తింపు
  • జిమ్ లో గంటలు గంటలు కసరత్తులు
  • తాజాగా జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్యారెక్టర్ నటి
  • బెంగళూరులో నిర్వహించిన చాంపియన్ షిప్ లో మూడో స్థానం

టాలీవుడ్ క్యారెక్టర్ నటి ప్రగతి ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిస్తారని తెలుసుగానీ, ఏకంగా జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. షూటింగ్ లు లేకపోతే జిమ్ లో ఎక్కువగా గడిపే ప్రగతి నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించారు. 

ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రగతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. 

ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం విశేషం. ప్రస్తుతం ప్రగతి అనేక సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News