Narendra Modi: రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్

AP Governor Adgul Nazeer and CM Jagan welcomes PM Modi at Reniginta airport
  • శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల పయనం
  • తిరుమలలో మోదీకి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి

తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం ద్వారా తిరుమల పయనమయ్యారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మోదీ ఈ రాత్రికి తిరుమలలోని రచన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News