patnam narender reddy: బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు

Case filed against BRS candidate Patnam Narender Reddy
  • తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్త కోస్గి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
  • నరేందర్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు
  • ఈ నెల 24వ తేదీన దాడి చేసినట్లు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్త

కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదయింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నావంటూ తనను రాళ్లతో, కర్రలతో కొట్టారంటూ కూర నరేశ్ అనే కాంగ్రెస్ కార్యకర్త నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేందర్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై ఐపీసీ 307తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చారు. 

ఈ నెల 24వ తేదీన తనపై దాడి చేశాడని కూర నరేశ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తన ఫోన్, బైక్ తాళంచెవి, మూడు తులాల బంగారు గొలుసు, రూ.20వేల నగదు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News