Kolkata Knight Riders: ఐపీఎల్ 2024 వేలానికి ముందు కీలక బౌలర్‌ను వదులుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

  • పృథ్వీ షాని రిటెయిన్ చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఐపీఎల్ 2024 నాటికి సిద్ధంగా ఉంటాడని భావిస్తున్న డీసీ యాజమాన్యం
  • వేలానికి సమయం ఆసన్నమవుతుండడంతో నిర్ణయం
Kolkata Knight Riders drop key bowler ahead of IPL 2024 auction

ఐపీఎల్ వేలాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్లు, వదులుకోనున్న ప్లేయర్లపై నిర్ణయం తీసుకుంటున్నాయి. కౌంటీ క్రికెట్‌లో మోకాలి గాయంతో క్రమంగా కోలుకుంటున్న డ్యాషింగ్ ఓపెనర్ పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించాలని నిర్ణయించుకుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫామ్‌లో లేని ఆల్‌రౌండర్-బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ని జట్టు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. తద్వారా రూ.10.75 కోట్లు జట్టు ఖాతాలో ఉండనుండడంతో మరో ఆటగాడిపై వెచ్చించాలని భావించింది.

అంతగా రాణించలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండేలను ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే వదులుకుంది. అయితే టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీలు పృథ్వీ షా సామర్థ్యాలపై నమ్మకం ఉంచారు. ఈ కారణంగా అతడిని జట్టు రిటెయిన్ చేసుకుంది.  వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి షా ఫిట్‌గా ఉంటాడని టీమ్ అంచనా వేస్తోంది.

ఇక శార్ధూల్ ఠాకూర్ విషయానికి వస్తే ఈ మధ్య ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరోవైపు  ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి రావడంతో శార్దూల్ ప్రాధాన్యత మరింత తగ్గిపోవడం మరో కారణంగా ఉంది. బౌలింగ్ లేదా బ్యాటింగ్ టాప్ 6లో చోటు దక్కించుకునే స్థాయిలో ఠాకూర్ రాణించలేకపోతున్నాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఠాకూర్‌ను వదిలేయడం ద్వారా రూ.10.75 కోట్లు టీమ్ ఖాతాలో అదనంగా ఉంటాయని, రూ.5 కోట్లతో కొత్త టాలెంటెడ్ ప్లేయర్‌ను దక్కించుకునేందుకు ఈ డబ్బుని వెచ్చించాలని భావిస్తోంది.

More Telugu News