నన్ను ఓడించేందుకు రూ. 300 కోట్లు పంపించారు: పొంగులేటి
- తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర పన్నారన్న పొంగులేటి
- బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని చెప్పారు. పదేళ్ల కాలంలో దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ. 300 కోట్లు పంపించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ పంచే డబ్బు మనదేనని... ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.