Tirumala: తిరుమల నడక దారిలో గుండెపోటుతో ఇంటెలిజెన్స్ డీఎస్పీ మృతి

Inteligence DSP Krupakar dead at Tirumala
  • మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు
  • 1,805 వ మెట్టు వద్ద కుప్పకూలిన కృపాకర్
  • ఆసుపత్రికి తరలించే లోపే తుదిశ్వాస

తిరుమలలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం చెందారు. మెట్ల దారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పితో కుప్పకూలారు. డీఎస్పీ కృపాకర్ వయస్సు 59 సంవత్సరాలు.. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ దగ్గర్లోని పోరంకి అని పోలీసులు తెలిపారు. కృపాకర్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News