Old city IT Raids: పాత బస్తీలో ఐటీ దాడుల కలకలం!

IT raids in Old city of Hyderabad
  • కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు
  • ఓ రాజకీయపార్టీకి నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు
  • షానవాజ్ ఇంటితో పాటూ ఫంక్షన్ హాల్, కార్యాలయంలో సోదాలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఐటీ రెయిడ్ల కలకలం రేగింది. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుతున్నారన్న సమాచారంపై ఐటీ అధికారులు ఓల్డ్ సిటీలోని బడా వ్యాపారస్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున ఫలక్‌నుమాలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టారు. దీంతో పాటూ, ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్, ఆఫీస్, హోటల్స్‌లో సోదాలు చేపట్టారు. 

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో కూడా నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫ్లయ్యింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్సు బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

  • Loading...

More Telugu News