State Election Commission: తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం

Election Commission green signal to Rythu Bandhu
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
  • రైతుబంధు సాయానికి అనుమతివ్వాలని ఈసీని కోరిన ప్రభుత్వం
  • పథకం పాతది కావడంతో పంపిణీకీ అనుమతించిన ఎన్నికల సంఘం
తెలంగాణ రైతులకు శుభవార్త... రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. 

దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
State Election Commission
rythu bandhu
Telangana Assembly Election

More Telugu News