Navdeep Saini: ఓ ఇంటివాడైన బౌలర్ నవదీప్ సైనీ... శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు

Pacer Navdeep Saini ties the knot with Swati Asthana
  • యూట్యూబర్ స్వాతి ఆస్తానాను పెళ్లాడిన నవదీప్ సైనీ
  • సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పంచుకున్న వైనం
  • ఇన్ స్టాగ్రామ్ లోనూ పాప్యులరైన స్వాతి ఆస్తానా
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ వైవాహిక జీవితంలోకి ప్రవేశించాడు. తన ప్రేయసి స్వాతి ఆస్తానాను పెళ్లాడాడు. సైనీ, స్వాతి చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. తాజాగా పెళ్లితో తమ ప్రేమను పండించుకున్నారు. తన పెళ్లి విషయాన్ని నవదీప్ సైనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. "నీ సాహచర్యంలో ఇకపై ప్రతి రోజూ ప్రేమలో పడుతూనే ఉంటా. మేమిద్దరం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం... మీ ఆశీస్సులు అందించండి" అని పేర్కొన్నాడు. 

కాగా, సైనీతో జీవితం పంచుకుంటున్న స్వాతి ఓ యూట్యూబర్. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వీడియోలతో సందడి చేస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లోనూ ఆమె చాలా పాప్యులర్. 

సైనీ-స్వాతి జంటకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, రాహుల్ తెవాటియా, మన్ దీప్ సింగ్, మొహిసిన్ ఖాన్, చేతన్ సకారియా తదితరులు విషెస్ తెలిపారు.
Navdeep Saini
Swati Asthana
Wedding
Team India

More Telugu News