Mitchell Marsh: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ మిచెల్ మార్ష్ పై ఢిల్లీలో కేసు నమోదు

Police case on Australia Cricketer Mitchell Marsh
  • వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టిన మిచెల్ మార్ష్
  • మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్

వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి, బీరు తాగుతూ దిగిన ఫొటో సంచలనం రేకెత్తించింది. ప్రపంచకప్ ను ఎంతో గొప్పగా భావించే వారంతా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంత అహంకారమా అని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిచెల్ మార్ష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రోఫీని అవమానించడమే కాక... 140 మంది భారతీయుల సెంటిమెంట్ ను గాయపరిచారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. 

  • Loading...

More Telugu News