Abraham: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం

BRS MLA Abraham joins Congress
  • అబ్రహంను పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
  • అబ్రహం బదులు విజేయుడికి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్
  • రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీని వీడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అబ్రహంను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. 

అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయనను మార్చి ఆ స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఇచ్చారు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన అబ్రహం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. 

2009లో కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్ పై అబ్రహం గెలిచారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు.
Abraham
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News