KTR: రాబోయే రోజుల్లో ‘స్కాంగ్రెస్’ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు వస్తాయి: కేటీఆర్

KTR alerts party cadre over deep fake propaganda videos
  • కేటీఆర్ ఫోన్ కాల్ పేరిట ఆడియో రికార్డింగ్‌ను షేర్ చేసిన కాంగ్రెస్
  • ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ నేతలను కేటీఆర్ కోరినట్టున్న ఆడియో వైరల్
  • తాజాగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్
  • ఈ ఉచ్చులో ఓటర్లు పడకుండా చూడాలని సూచన
రాబోయే రోజుల్లో  స్కాంగ్రెస్ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు రాబోతున్నాయని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ఉచ్చులో పడకుండా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచన. ఈ మేరకు శ్రేణులను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో స్కాంగ్రెస్ నుంచి అర్థరహిత ప్రొపగాండా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. 

సిరిసిల్లలో ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ కేటీఆర్ అక్కడి పార్టీ శ్రేణులకు హితబోధ చేసినట్టు చెబుతున్న ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ మెజారిటీ తగ్గుతుందని నేతలు మాట్లాడడం భావ్యం కాదని కేటీఆర్ అన్నట్టు ఆడియోలో ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
KTR
BRS
Congress
Telangana
Telangana Assembly Election

More Telugu News