Nara Lokesh: చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు... ఆ ఫైలుపై సంతకం చేయలేదు: నారా లోకేశ్

Nara Lokesh opines on liquor case
  • చంద్రబాబుపై మద్యం అనుమతుల కేసు
  • ప్రివిలేజ్ ఫీజు ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదన్న లోకేశ్
  • జగనాసుర కుట్రలో భాగంగా చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆగ్రహం
  • ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని వెల్లడి

చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం అనుమతుల కేసు నమోదు చేసిన నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబుపై జగన్ తప్పుడు మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు... ఆ ఫైలుపై సంతకం చేయలేదు అని వెల్లడించారు. జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వరుస కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News