Chandrababu: చంద్రబాబు రెండు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. అప్డేట్స్ ఇవిగో..!

Updates on Chandrababu bail petitions
  • రింగ్ రోడ్డు, లిక్కర్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు
  • రింగ్ రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
  • లిక్కర్ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన రెండు కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. 

మరోవైపు... లిక్కర్ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. భోజన విరామం తర్వాత విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
Chandrababu
Telugudesam
Inner Ring Road Case
Liquor Case
AP High Court

More Telugu News