Shami tweet: తల్లి అనారోగ్యంపై షమీ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

Mohammed Shami tweet went viral
  • ఫైనల్ మ్యాచ్ ముందు షమీ తల్లికి అనారోగ్యం
  • ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందించిన వైద్యులు
  • అమ్మా, నువ్వు త్వరగా కోలుకోవాలంటూ షమీ ట్వీట్
ప్రపంచ కప్ మెగా టోర్నీలో బౌలింగ్ లో మెరిసిన మహ్మద్ షమీ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ.. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు కూడా టెన్షన్ పడిన వార్త బయటకు వచ్చింది. సరిగ్గా ఫైనల్ మ్యాచ్ కు ముందురోజు షమీ తల్లి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో షమీ బంధువులు ఆమెను గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడి సూచనతో మెరుగైన వైద్యం కోసం సిటీకి తరలించారు. ఈ వార్త షమీని టెన్షన్ కు గురిచేసినట్లు సమాచారం. చికిత్స తర్వాత షమీ తల్లి అంజుమ్ ప్రస్తుతం కోలుకున్నారు.

మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్ లో చతికిలపడిన విషయం తెలిసిందే. టోర్నీ ముగిసిన తర్వాత షమీ తన ఇంటికి చేరుకున్నాడు. తల్లిని కలుసుకున్న సందర్భంగా ఎమోషనల్ గా ఫీలయ్యాడు. తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ.. ‘అమ్మా నువ్వంటే నాకెంతో ఇష్టం.. నీ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకుంటున్నా’ అంటూ అందులో కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shami tweet
world cup
shami mother
hospitalized

More Telugu News