Vijayashanti: నేను చెప్పింది నిజమైంది.. అయినా సరే కొట్లాడుదాం... భయపడేది లేదు: విజయశాంతి

VijayaShanti responds on ED press note
  • వివేక్ ఇళ్లు, కార్యాలయాలలో సోదాలపై ఈడీ ప్రకటనపై స్పందించిన రాములమ్మ
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నేను చెప్పింది నిజమని తెలిసిపోతోందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగానే బీజేపీ ఈడీ, ఐటీలను పంపిస్తోందని ఆరోపణ

మాజీ ఎంపీ వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. తాను చెప్పినట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిసిపోతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్ ఈసీకీ ఫిర్యాదు చేయగానే బీజేపీ ఈడీ, ఐటీలను సోదాల కోసం పంపిస్తోందని ఆరోపించారు. అందుకే వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇన్ని రోజులు బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి ఈడీ, ఐటీ రైడ్స్ జరగలేదన్నారు. బీజేపీ నుంచి బయటకు రాగానే ఈ దాడులు దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. అయినా సరే కొట్లాడుదాం... నేను అయినా, వివేక్ అయినా, మిగతా ఉద్యమకారులు ఎవరైనా... భయపడేది లేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఈడీ ప్రకటన కాపీని విజయశాంతి అటాచ్ చేశారు.

  • Loading...

More Telugu News