gangula kamalakar: పవన్ కల్యాణ ఎవరు... ఎక్కడి నుంచి వస్తున్నాడు?: మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు

Minister Gangula slams Pawan Kalyan for campaign in telangana
  • తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చాడు? అని నిలదీత
  • కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దొంగలని... ఢిల్లీ గులాములని విమర్శలు
  • బండి సంజయ్ తనపై మూడోసారి ఓడిపోతారన్న గంగుల  
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం గంగుల మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? అని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఎందుకు వచ్చాడు? అని నిలదీశారు. అసలు కేఏ పాల్ ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్‌నే చంపుతా అంటాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దొంగలని, ఢిల్లీ గులాములని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మీద పోటీ చేస్తున్న బీజేపీ నేత బండి సంజయ్ మూడోసారి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. గుండెపోటు డ్రామాను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
gangula kamalakar
Pawan Kalyan
Janasena
BJP
Telangana Assembly Election

More Telugu News