seethakka: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పక్కా... నన్నూ గెలిపిస్తే మంత్రిని అవుతా'నన్న సీతక్క

Seethakka says congress will win Telangana assembly elections
  • గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానన్న సీతక్క
  • ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని వ్యాఖ్య
  • సీతక్కపై బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి ప్రహ్లాద్ నాయక్ పోటీ
తనను మళ్లీ గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆమె ములుగు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించి, అధికారంలోకి వస్తుందన్నారు. తనను కూడా గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడకు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 

కాగా, 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గెలిచారు. 2014లోనూ టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క 2018లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సీతక్క, బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీలో ఉన్నారు.
seethakka
Congress
Telangana Assembly Election

More Telugu News