కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే.. ప్రతిగా 50 మంది బందీల విడుదల
- ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం
- 4 రోజులు యుద్ధానికి విరామం ప్రకటించనున్న నెతన్యాహు
- రిలీఫ్ మెటీరియల్ తో వచ్చిన ట్రక్కులకు గాజాలోకి అనుమతి
ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. ప్రతీ రోజూ పదిమంది చొప్పున బందీలను విడుదల చేయాలని, నాలుగవ రోజు 20 మందిని విడుదల చేయాలని ఇజ్రాయెల్ పెట్టిన షరతుకు హమాస్ మిలిటెంట్లు అంగీకరించారు. బుధవారం ఉదయం హమాస్ విడుదల చేసిన స్టేట్ మెంట్ ప్రకారం.. ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 150 మంది పాలస్తీనియన్లకు విముక్తి కలగనుందని తెలిపారు. దీంతోపాటు రిలీఫ్ మెటీరియల్ తీసుకొచ్చిన ట్రక్కులను గాజాలోకి అనుమతించేలా ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాగా, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం వహించి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య ఈ ఒప్పందం కుదిర్చాయి.