Akhilesh Yadav: ఇలా జరిగి ఉంటే ఇండియా ప్రపంచకప్ గెలిచేది: అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav on Team India defeat in World Cup finals
  • అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్స్ లో టీమిండియా ఓటమి 
  • లక్నోలో ఫైనల్స్ జరిగి ఉంటే ఇండియా గెలిచేదన్న అఖిలేశ్
  • టీమిండియాకు విష్ణువు, వాజ్ పేయి ఆశీస్సులు ఉండేవన్న మాజీ సీఎం
వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో టీమిండియా ఓటమి కోట్లాది మంది భారతీయులను కలచివేస్తోంది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో కాకుండా లక్నోలో ఫైనల్స్ జరిగి ఉంటే ఇండియా గెలిచేదని ఆయన అన్నారు. లక్కోలో మ్యాచ్ జరిగి ఉంటే భారత జట్టుకు మహా విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆశీస్సులు లభించేవని చెప్పారు. లక్నోలోని క్రికెట్ స్టేడియంకు అప్పటి సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఏకనా అనే పేరు పెట్టింది. మహా విష్ణువుకు ఉన్న పేర్లలో ఏకనా కూడా ఒకటి. అయితే, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత స్టేడియం పేరును అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంగా మార్చారు.
Akhilesh Yadav
Samajwadi Party
Team India
ODI World Cup

More Telugu News