Madhu Yaskhi: ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ వినూత్న ప్రచారం

LB Nagar Congress candidate Madhu Yashki campaign in Metro train
  • మెట్రోలో ప్రయాణిస్తూ పాసింజర్లతో ముచ్చటించిన మధుయాష్కీ
  • మెట్రో స్టేషన్‌లో, రైలులో ప్రచారం చేసి ఆకట్టుకున్న మధుయాష్కీ
  • ఫోటోలను ట్వీట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ వినూత్న ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో ముచ్చటించారు. యాష్కీ మెట్రో ప్రచారానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది.

'మెట్రో చాట్ విత్ మధు యాష్కీ గౌడ్ గారు.. వినూత్న ప్రచారానికి తెరలేపిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ గారు' అంటూ ట్వీట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధుయాష్కీ ఎల్బీ నగర్ నియోకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Madhu Yaskhi
Congress
Telangana Assembly Election
metro train

More Telugu News