Pawan Kalyan: తెలంగాణలో రేపటి నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం

 Pawan Kalyan to campaign in telangana from tomorrow
  • రేపు వరంగల్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి రావు పద్మ తరఫున ప్రచారం
  • 25, 26 తేదీల్లో జనసేన అభ్యర్థుల తరఫున జనసేనాని ప్రచారం
  • ప్రధాని మోదీ పాల్గొనే సభలలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు.
Pawan Kalyan
Janasena
BJP
Telangana Assembly Election

More Telugu News