Game Changer: మైసూర్ కి షిఫ్ట్ అవుతున్న 'గేమ్ చేంజర్' టీమ్!

Game Changer movie update
  • షూటింగు దశలో 'గేమ్ చేంజర్'
  • పొలిటికల్ టచ్ తో సాగే యాక్షన్ మూవీ 
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న భారీ తారాగణం
మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'గేమ్ చేంజర్' పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతూ వచ్చింది. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. రీసెంటుగా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసిన టీమ్, ఆ తరువాత షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటోంది. 

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేయనున్నారు. రాజకీయాలతో కూడిన యాక్షన్ మూవీగా ఈ సినిమాను శంకర్ రూపొందిస్తున్నాడు. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు.  

శంకర్ మార్క్ పాటలు .. సన్నివేశాలతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కియారా అద్వాని అందాల సందడి చేయనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. ఎస్. జె. సూర్య .. సునీల్ .. సముద్రఖని .. అంజలి కనిపించనున్నారు.
Game Changer
Ram Charan
Kiara Adwani
Shankar

More Telugu News