Rohit Sharma: రోహిత్‌.. వంద కోట్ల హృదయాలు నీకు ప్రేమను పంచుతున్నాయి: రాధికా గుప్తా

Edelweiss CEO Radhika Gupta lovely words on Rohit Sharma
  • ఫైనల్స్ లో ఓటమి అనంతరం కంటతడి పెట్టుకున్న రోహిత్ శర్మ
  • ఈ కన్నీళ్లు నిన్న బలహీనపరచలేవన్న ఎడిల్ వీస్ సీఈవో
  • గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయని వ్యాఖ్య

2023 వన్డే ప్రపంచకప్ లో ఓటమి ఎరుగని టీమిండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కోట్లాది మంది భారతీయులను తీవ్రంగా వేధిస్తోంది. ఓటమి బాధ నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. ఓటమి అనంతరం చెమ్మగిల్లిన కళ్లతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానాన్ని వీడుతుండటాన్ని చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సొంత రికార్డులను కూడా చూసుకోకుండా టోర్నీ మొత్తం రోహిత్ శర్మ తన సర్వ శక్తులను ధారపోశాడు. రోహిత్ కంటతడిని చూసి చలించిపోయిన వారిలో వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. 

తాజాగా ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఎడిల్ వీస్ సీఈవో రాధికా గుప్తా కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయని ఆమె అన్నారు. 'ఈ కన్నీళ్లు నిన్ను బలహీనపరచలేవు. వంద కోట్ల హృదయాలు నీకు ప్రేమను పంచుతున్నాయి కెప్టెన్' అని ట్వీట్ చేశారు. చెమ్మగిల్లిన కళ్లతో ఉన్న రోహిత్ ఫొటోను షేర్ చేశారు. 

  • Loading...

More Telugu News