Bandi Sanjay: ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నోసార్లు జైలుకెళ్లాను: బండి సంజయ్

Bandi Sanjay campaign at Padmashali athmeeya Sammelanam
  • ఎంపీని కాకముందే ప్రజల పక్షాన పోరాడానన్న బండి సంజయ్
  • ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కాలేదని వెల్లడి
  • బీజేపీ కార్యకర్తపై దాడి జరిగితే పోరాడానన్న కరీంనగర్ ఎంపీ
తాను ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశానని, జైలుకు కూడా వెళ్లానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తాను ఎంపీని కాకముందే ప్రజల పక్షాన కొట్లాడి ఐదుసార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. కరీంనగర్ లో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ విఫలం కాలేదన్నారు. బీజేపీ కార్యకర్తపై దాడి జరిగితే పోరాడానని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాపాలన రావాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
Bandi Sanjay
BJP
Telangana Assembly Election

More Telugu News