Vivek Venkataswamy: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంటిపై ఐటీ దాడులు.. కొనసాగుతున్న తనిఖీలు

IT Raids on congress leader Vivek Venkataswamy house
  • మంచిర్యాలలోని ఆయన ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు
  • తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి కొనసాగుతున్న తనిఖీలు
  • వివేక్ అనుచరుల ఇళ్లలోనూ దాడులు
  • కావాలనే చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల ఆగ్రహం

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఈ తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులకు దిగారు. ఉదయం ఐదున్నర గంటలకు మంచిర్యాల లోని ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

వివేక్ ఇంట్లో ఐటీ సోదాల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఓటమి భయంతో అధికార పార్టీ.. పోలీసులు, ఐటీ అధికారులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలోని పలువురు అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News