Megastar Chiranjeevi: నేనేం ఇవ్వగలుగుతాను.. నా ప్రాణం తప్ప: మెగాస్టార్ చిరుకి బర్త్‌డే గిఫ్ట్‌పై వైష్ణవ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

What can I give except my life says Vaishnav Tej on Megastar Chiranjeevi birthday special Photo
  • చిరంజీవి బర్త్‌డే సందర్భంగా చేయించుకున్న ‘చిరు హెయిర్‌ స్టైల్’పై వైష్ణవ్ ఆసక్తికర స్పందన
  • అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుండడంతో తాను హెయిర్ స్టైల్ గిఫ్ట్ ఇచ్చానని వెల్లడి
  • ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గమనించి ఈ హెయిర్ స్టైయిల్ చేయించుకున్నానని చెప్పిన మెగా హీరో
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకుమించి చిరంజీవి కుటుంబంలోనే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. మెగా హీరోల్లో ఒకరైన వైష్ణవ్ తేజ్ తాను ఈ కోవకే చెందుతానని చెబుతున్నారు. నవంబర్ 24న విడుదల కానున్న ‘ఆదికేశవ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ చిరు అంటే ఎంత అభిమానం ఉందో చాటిచెప్పుకున్నాడు. తన తల మీద చిరు అని హెయిర్ కటింగ్ ఉన్న ఫొటోకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వైష్ణవ్ తేజ్ వెల్లడించాడు.

పెద్ద మామయ్య చిరంజీవి బర్త్ డేకి అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారని, అన్నయ్య కత్తి ఇచ్చాడని తెలిపాడు. ‘‘నేనేం ఇవ్వగలుగుతాను. నా ప్రాణం తప్ప’’ అని వైష్ణవ్ తేజ్ అన్నాడు. ఆ సమయంలోనే తానొక ఫుట్ బాల్ మ్యాచ్ చూశానని, ఫుట్‌బాల్ మాదిరిగా హెయిర్ కట్ చేయించుకోవడం గమనించానని, ఆ విధంగా చేయిద్దామని అప్పుడు ఫిక్స్ అయ్యి తలపై చిరు అని రాయించుకున్నానని వైష్ణవ్ తేజ్ వివరించాడు.  చిరంజీవి, పెద్ద మామ అని రాయిద్దామనుకున్నా చిరు అనేది తలకు సరిపోతుందని రాయించుకున్నానని వివరించాడు. 

ఇదిలావుండగా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. వైష్ణవ్ సరసన శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాకి ఎన్.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.
Megastar Chiranjeevi
Vaishnav Tej
Adikesava movie
Sreelila
Tollywood

More Telugu News