KTR: కేటీఆర్‌ను కలిసిన నిరుద్యోగులు... ఎన్నికల తర్వాత మాట్లాడుతానని చెప్పిన మంత్రి

Had an insightful conversation with the Govt job aspirants from Ashok Nagar ktr tweet
  • మంత్రిని కలిసిన హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు చెందిన నిరుద్యోగ యువత
  • ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో మాట్లాడినట్లు వెల్లడించిన కేటీఆర్
  • భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వారికి హామీ
మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును పలువురు నిరుద్యోగులు కలిసి, వినతిపత్రం అందించారు. తనను హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు చెందిన నిరుద్యోగ యువత కలిసిందని కేటీఆర్ ట్వీట్ చేసి, ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. జీవితంలో ముందుకు వెళ్లాలనే ఆశతో తనను కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో తాను మాట్లాడానని పేర్కొన్నారు. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వారికి హామీ ఇస్తూ, ఎన్నికలు ముగిసిన తర్వాత వారితో అక్కడే చర్చిస్తానని చెప్పినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
KTR
Telangana Assembly Election
BRS

More Telugu News