Pradeep: అప్పట్లో నా బిజినెస్ పేకమేడలా కూలిపోయింది: నటుడు ప్రదీప్

  • జంధ్యాల వలన హీరోగా పరిచయమైన ప్రదీప్
  • ఆ తరువాత టీవీ సీరియల్స్ తో బిజీ 
  • స్టూడియో పెట్టడం వలన ఎదురైన నష్టాలు
  • కోలుకోవడానికి నాలుగున్నరేళ్లు పట్టిందని వెల్లడి  

Actor Pradeep Interview

జంధ్యాల సినిమాలతో హీరోగా పరిచయమైన ప్రదీప్, ఆ తరువాత కాలంలో ఎక్కువగా దూరదర్శన్ సీరియల్స్ చేస్తూ వెళ్లారు. ఈ మధ్య కాలంలో మళ్లీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

"1992లో నేను 'లో బ్యాండ్' ఎక్విప్ మెంట్ తో 'గ్రీన్ మ్యాట్' స్టూడియో పెట్టాను. అందుకు నాకు 30 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు నేను దూరదర్శన్ లో 6 సీరియల్స్ చేస్తున్నాను. ఆ వర్క్ నా స్టూడియోలో నడుస్తుందని నేను భావించాను. కానీ 'హై బ్యాండ్' ఎక్విప్ మెంట్ లో మాత్రమే చేయాలనే ఒక నిబంధన పెట్టారు. దాంతో నా బిజినెస్ పేకమేడలా కూలిపోయింది" అన్నారు. 

"ఆ బిజినెస్ వలన నేను 30 లక్షలు నష్టపోయాను .. ఆ డబ్బును నేను బ్యాంకుకి కట్టాలి. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ, ఆ అప్పు తీర్చలేను. నాలుగున్నరేళ్లు కష్టపడి అప్పుతీర్చాను. ఆ తరువాత 'జీరో' నుంచి మళ్లీ జీవితం మొదలెట్టాను. నా దర్శక నిర్మాణంలో వచ్చిన 'చాణక్య' నుంచి మళ్లీ పుంజుకున్నాను" అంటూ చెప్పారు. 

More Telugu News