Dressing Room Celebrations: బరువెక్కిన గుండెలతో డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్.. మళ్లీ కోహ్లీకే మెడల్

Team India Dressing Room Celebrations Kohli One Again Got Best Fielder Award
  • ఈ ప్రపంచకప్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న భారత జట్టు
  • మైదానంలో ప్రతిభ చూపిన ఆటగాడికి మెడల్
  • మొదటి నుంచి ఇప్పటి వరకు డ్రెస్సింగ్ సెలబ్రేషన్స్ వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ

ఈ ప్రపంచకప్‌ సందర్భంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూం సెలబ్రేషన్స్ అనే కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఫీల్డింగ్‌లో ప్రతిభ చూపించిన ఆటగాడిని మెడల్‌తో సత్కరిస్తూ వస్తోంది. తాజాగా, ఫైనల్ మ్యాచ్ అనంతరం కూడా సెలబ్రేషన్స్ నిర్వహించింది. అయితే, ఈసారి బరువెక్కిన హృదయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

మరోమారు విరాట్ కోహ్లీకే మెడల్ సొంతమైంది. రవీంద్ర జడేజా మెడల్‌ను కోహ్లీ మెడలో వేసి అభినందించాడు. కోహ్లీ మెడల్ అందుకోవడం ఇది రెండోసారి. ఈ వేడుకతోపాటు మొదటి నుంచి జరిగిన డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. 

ఈ వీడియోలో జట్టు సభ్యులతో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ.. ఈ ఓటమి మనకి చాలా బాధను మిగిల్చిందని అన్నాడు. మనం మన ప్రయత్నం మేరకు కష్టపడి ఆడినా ఫలితం మాత్రం మరోలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ విచారించాల్సిన అవసరం లేదని, రాహుల్ చెప్పినట్టు మనకు మనం గర్వపడాలని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి శ్రేయాస్ థ్యాంక్స్ చెప్పాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News