Anushka Sharma: భర్తను ఓదార్చిన అనుష్క శర్మ..ఫొటోలు వైరల్

Anushka Sharma consoles Virat Kohli after epic loss at World Cup Final
  • ఆస్ట్రేలియాతో ఓటమి తరవాత విరాట్ కంట కన్నీరు
  • కష్ట సమయంలో భర్తకు అండగా నిలిచిన అనుష్క శర్మ
  • నెట్టింట అనుష్కపై ప్రశంసలు
వరల్డ్ కప్ ఫైనల్స్‌ భారతీయులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా చివరి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో భారత క్రీడాకారులు తీవ్ర విచారంలో కూరుకుపోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. 

తీవ్ర విచారంలో కూరుకుపోయిన విరాట్ కోహ్లీకి భార్య అనుష్క శర్మ అండగా నిలిచింది. భర్తను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అనుష్కపై ప్రశంసలు కురుస్తున్నాయి. కష్టసమయంలో జీవిత భాగస్వామికి వెన్నంటి నిలుస్తోందంటూ జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వారు ఆదర్శ దంపతులంటూ కితాబునిచ్చారు.
Anushka Sharma
Virat Kohli
Cricket

More Telugu News