Harbhajan Singh: అనుష్క శర్మపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట విమర్శలు

IND vs AUS Harbhajan Singh gets SLAMMED for sexist remark on Anushka Sharma Athiya Shetty
  • వరల్డ్ కప్ మ్యాచ్‌లో హిందీ వ్యాఖ్యాతగా హర్భజన్ సింగ్
  • అనుష్క శర్మ, అతియా శెట్టికి క్రికెట్ గురించి తెలియకపోవచ్చంటూ వ్యాఖ్య
  • హర్భజన్ తీరుపై మండిపడ్డ నెటిజన్లు
  • పురుష దురహంకారం పనికిరాదంటూ విమర్శల వెల్లువ
వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా హిందీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ అర్థాంగి అతియా శెట్టి లపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. 

మ్యాచ్ సందర్భంగా అనుష్క, అతియా ట్రెండీ వేర్‌‌లో మెరిసిపోతూ మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే, హర్భజన్ సింగ్ వారిని ఉద్దేశిస్తూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు. ‘‘వాళ్లకు క్రికెట్ గురించి పెద్దగా ఏమీ తెలిసి ఉండదు. బహుశా సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండి ఉంటారు’’ అని కామెంట్ చేశారు. దీంతో, నెట్టింట అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. పురుష దురహంకార వ్యాఖ్యలు చేసినందుకు హర్భజన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Harbhajan Singh
Anushka Sharma
Ind Vs Aus

More Telugu News