Rohit Sharma: కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ... వీడియో ఇదిగో!

Rohit Sharma cries after Team India lose
  • ఆసీస్ చేతిలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన టీమిండియా
  • భావోద్వేగాలను దాచుకోలేకపోయిన రోహిత్ శర్మ
  • సిరాజ్ కూడా కన్నీటి పర్యంతం... ఓదార్చిన ఇతర ఆటగాళ్లు

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపు పరుగు తీసిన మరుక్షణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటితో మైదానాన్ని వీడాడు. సాధారణంగా కూల్ గా ఉండే రోహిత్ శర్మ... ఇవాళ భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకునేందుకు తలదించుకుని మైదానం నుంచి బయటికి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, మహ్మద్ సిరాజ్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. సిరాజ్ ను బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఓదార్చడం కనిపించింది. ఏదేమైనా, వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి, ఫైనల్లో ఓడిపోవడం టీమిండియా ఆటగాళ్లను తీవ్ర వేదనకు గురిచేసింది.

  • Loading...

More Telugu News