Australia: కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా...!

World Cup winner Australia gets 40 lakh dollars as prize money
  • భారత్ లో ముగిసిన వన్డే వరల్డ్ కప్
  • విజేతగా అవతరించిన ఆస్ట్రేలియా
  • ఆసీస్ జట్టుకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి
  • రన్నరప్ టీమిండియాకు రూ.16.65 కోట్లు
అక్టోబరు 5న ప్రారంభమై, ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు, మరెన్నో ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శనలకు వేదికగా నిలిచిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 ముగిసింది. నేడు జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి, రికార్డు స్థాయిలో 6వ సారి వరల్డ్ కప్ ను గెలిచింది. కాగా, ఈ విజయంతో ఆసీస్ జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కమిన్స్ సేనకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి అందించనున్నారు. రన్నరప్ గా నిలిచిన టీమిండియాకు రూ.16.65 కోట్లు లభించనున్నాయి. సెమీఫైనల్స్ లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు రూ.6.66 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. లీగ్ దశలోనే నిష్క్రమించిన జట్లకు రూ.83 లక్షల చొప్పున ఇవ్వనున్నారు.
Australia
Prize Money
Winner
World Cup

More Telugu News