Adam Zampa: మురళీధరన్ రికార్డును సమం చేసిన ఆడమ్ జంపా

Adam Zampa equaled Muralidharans record
  • ప్రస్తుత ప్రపంచ కప్‌లో 23 వికెట్లు పడగొట్టిన ఆడమ్ జంపా
  • ఒకే ఎడిషన్‌లో 23 వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌తో సమంగా నిలిచిన జంపా
  • ఫైనల్లో టీమిండియాపై ఒక వికెట్ తీయడంతో జంపా మైలురాయి

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వన్డే వరల్డ్ కప్-2023లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో 23 వికెట్లు తీసిన జంపా ఒకే వరల్డ్ కప్‌ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఒక వికెట్ తీయడంతో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2007 వరల్డ్ కప్ ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ముత్తయ్య మురళీధరన్ 23 వికెట్లు తీశాడు. ఆ రికార్డును జంపా సమం చేశాడు. ఈ జాబితాలో బ్రాడ్ హాగ్ (2007), షాహిద్ అఫ్రిది (2011) చెరో 21 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

మరోవైపు.. భారత గడ్డపై వన్డేల్లో 50 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా కూడా జంపా నిలిచాడు. ఈ రికార్డుని చేరుకోవడానికి జంపా 27 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్ దశలో భారత్‌పై ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినప్పటికీ మిగతా జట్లపై జంపా రాణించాడు. శ్రీలంకపై 4 వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించాడు. కాగా ఈ వరల్డ్ కప్ ఎడిషన్‌లో జంపా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News