Roja: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుంది: మంత్రి రోజా

AP Minister Roja wishes all the best for Team India
  • ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రోజా 
  • 20 ఏళ్ల నాటి పరాభవానికి బదులు తీర్చుకునే సమయం వచ్చిందన్న రోజా
వరల్డ్ కప్-2023లో టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని ఏపీ మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నీలో విజేతగా నిలవబోతోందని తెలిపారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు ఆసీస్ పై ఫైనల్లోనూ గెలవడం ద్వారా 20 ఏళ్ల నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందని రోజా స్పష్టం చేశారు. ఇందులో డౌటే లేదని అన్నారు. 

యావత్ భారతీయులంతా టీమిండియా విజయం కోసం ప్రార్థనలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. గత 12 ఏళ్లుగా మనం వరల్డ్ కప్ నెగ్గేందుకు ఎదురుచూస్తున్నామని రోజా వివరించారు. 2011 తర్వాత టీమిండియాకు మరోసారి అవకాశం వచ్చిందని, ఈ సందర్భంగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని వెల్లడించారు.
Roja
Team India
World Cup
Australia

More Telugu News