World Cup 2023: ప్రపంచకప్ ట్రోఫీతో భారత్, ఆస్ట్రేలియా స్కిప్పర్ల ఫొటోషూట్ వైరల్.. ఫొటోలు ఇవిగో!

Team India and Australia Skippers Pre Shoot With World Cup Trophy Goes Viral
  • మరికాసేపట్లో భారత్-ఆసీస్ మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం
  • ప్రపంచకప్ ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్
  • అటలాజ్ స్టెప‌వెల్‌లో ఫొటోషూట్
మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా, ఆసీస్ సారథులు రోహిత్‌శర్మ, పాట్ కమిన్స్ ప్రపంచకప్ ట్రోఫీతో ప్రీమ్యాచ్ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. గుజరాత్‌ గాంధీనగర్‌లోని చిన్న పట్టణమైన అడలాజ్  స్టెప్‌వెల్‌లో ఈ ఫొటో  సెషన్ నిర్వహించారు. స్కిప్పర్లు ఇద్దరూ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను ఐసీసీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. 

  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. ఆటగాళ్లే కాదు.. యావత్ దేశం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరుస విజయాలతో ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రపంచకప్ అందించాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా ఆరో కప్‌పై కన్నేసింది.  
   
World Cup 2023
World Cup Trophy
Photoshoot
Rohit Sharma
Adalaj Stepwell
Pat Cummins

More Telugu News