Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి

Malayalam actor Vinod Thomas found dead inside parked car in Kerala
  • కొట్టాయం జిల్లాలోని ఓ హోటల్ సమీపంలో ఘటన 
  • పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్
  • హోటల్ సిబ్బంది అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం
  • పోస్ట్‌మార్టం తరువాత అన్ని వివరాలు తెలుస్తాయన్న పోలీసులు
మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, వినోద్ మరణం గురించి వెలుగులోకి వచ్చింది.
 
‘‘కారులో విగతజీవిగా పడి ఉన్న ఆయనను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాం. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు’’ అని స్థానిక పోలీసులు తెలిపారు. వినోద్ మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కారు ఏసీలోని విషపూరిత వాయువు పీల్చడంతో అతడు మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోస్ట్ మార్టం తరువాతే వినోద్ మరణానికి గల కారణం తెలుస్తుందని వెల్లడించారు. హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి చిత్రాలతో వినోద్ థామస్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
Vinod Thomas
Mollywood
Tollywood

More Telugu News