Priyanka Gandhi: రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi to tour telangana tomorrow
  • ఖానాపూర్, అసిఫాబాద్‌లలో ప్రచారం చేయనున్న ప్రియాంక 
  • నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖానాపూర్‌కు  
  • ఖానాపూర్‌లో గంటసేపు ప్రచారం నిర్వహించనున్న ప్రియాంక  
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. రేపు ప్రియాంక గాంధీ ఖానాపూర్, అసిఫాబాద్‌లలో పర్యటించనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి నాందేడ్ చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు. ఇక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసిఫాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు.
Priyanka Gandhi
Congress
Telangana Assembly Election

More Telugu News